గుంటూరులో గెయిల్ ఇండియా లిమిటెడ్ సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన రెండు మొబైల్ మెడికల్ యూనిట్లను కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రివర్యులు ముఖ్యఅతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ప్రతి యూనిట్ వాహనం నిర్వహణకు ఏడాదికి రూ. 35 లక్షలు ఖర్చు చేస్తూ, ఈ వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం తిరిగి ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించనున్నాయి.