నరసరావుపేట శ్యాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాల నందు పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు రానున్న కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అధిక మెజారిటీతో గెలిపించుకుందామని దాని కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ కోరారు.