ఈనెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిడుగురాళ్ల బ్రాంచ్ పరిధిలోని ఆసుపత్రులలో వైద్య సేవలు నిలిపివేయడం జరుగుతుందని శుక్రవారం యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ ధూళిపాళ్ల భరత్ కుమార్ తెలిపారు. శుక్రవారం కార్యదర్శి డాక్టర్ బొర్రా రామప్రసాద్ కలిసి బ్రాంచ్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ లో వైద్యుని హత్యకు నిరసనగా సేవలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు