దాచేపల్లిలోని 10వ వార్డు 126వ బూత్లో రేషన్ షాపునకు రాలేని వృద్ధులకు గురువారం వారి ఇంటి వద్దకే వెళ్లి డీలర్ అపర్ణ శ్రీనివాస్ సరుకులు పంపిణీ చేశారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పంపిణీ చేపట్టారు. బూత్ కన్వీనర్లు యేలిశెట్టి అప్పారావు, బుర్రి సురేష్ పాల్గొన్నారు.