దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని గామాలపాడులో ఆదివారం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్య దేవాలయంలో స్వామివారి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం రాత్రి తిరుపతమ్మ, గోపయ్య స్వామిని ట్రాక్టర్ పైకి ఎక్కించి గ్రామంలోని పురవీధుల్లో డప్పు, వాయిద్యాల నడుమ ఊరేగింపుగా భక్తులు తీసుకెళ్లారు.