పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్-6 పథకాలు ఉచిత గ్యాస్, రేషన్ కార్డు, వృద్ధాప్య పెన్షన్, వికలాంగ పెన్షన్, గృహ నిర్మాణం, చంద్రన్న భీమా అర్హులందరూ రుసుము లేకుండా పొందాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత వైసీపీ హయాంలో అవినీతితో పేదలు ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు అధికారులు పారదర్శకంగా పథకాలు అందించాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.