ఎడ్ల పందాలు మన సంప్రదాయాల్లో, గ్రామీణ సంస్కృతిలో భాగమని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. మాచవరం మండలం మొర్జంపాడులో శనివారం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఎడ్ల బండలాగుడు పందాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మారుతున్న ఆధునిక సమాజంలో భావితరాల యువత తెలుగు పండుగలు సంప్రదాయాలు తెలియని పరిస్థితి ఉందన్నారు.