ఉమ్మడి కృష్ణా - గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కోరారు. శనివారం పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు బూత్ లెవెల్ కమిటీలను నియమించారు. గురజాల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సి ఆర్ రాజన్, కల్లం రాజశేఖర్ పాల్గొన్నారు.