మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సి. ఐ. టి. యు ఆధ్వర్యంలో పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ ఏ. ఇ రఘురావుకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇంజనీరింగ్ కార్మికులకు ఇచ్చిన కార్మికుల పర్మినెంట్, కనీస వేతనం రూ.26,000 తదితర హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.