పిడుగురాళ్ల: సాగర్ కాల్వ ఆధునికీకరణకు నిధులివ్వండి

61చూసినవారు
పిడుగురాళ్ల: సాగర్ కాల్వ ఆధునికీకరణకు నిధులివ్వండి
నాగార్జునసాగర్ కాల్వలు, బుగ్గవాగు ఆధునీకరణకు నిధులు ఇవ్వాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు. విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయంలో ఎమ్మెల్యే యరపతినేని మంత్రిని మంగళవారం కలిసి గురజాల నియోజకవర్గంలో ఇరిగేషన్ సమస్యలను వివరించి, కాల్వల ఆధునికీకరణకు నిధులు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే వెంట నాగార్జున సాగర్ కుడికాలువ కమిటీ చైర్మన్ పులుకూరి కాంతారావు వున్నారు.

సంబంధిత పోస్ట్