పిడుగురాళ్ల మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సమస్యలను పరిష్కరించామని తహశీల్దార్ మధుబాబు శనివారం తన కార్యాలయంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలపై 28, సర్వేకు సంబంధించి అర్జీలు 40, కుల ధృవీకరణకు సంబంధించి సంబంధించి 3, రీ సర్వే ఎల్పీఎంకు సంబంధించిన 4, నిషేధిత జాబితాను తొలగించిన భూమి విషయంపై రెండు అర్జీలపై పరిష్కారం చూపించామన్నారు.