పిడుగురాళ్ల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని మండల ఉపాధి హామీ పథకం ఏపీఓ మేరీ గ్రిస్మా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో కూడా మేట్లను ఉపయోగించి ఉపాధి హామీ పనులు చేస్తున్నమన్నారు. ప్రతి మేటుకు సుమారు 25 నుంచి 50 మంది కూలీలు ఉంటారని తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రజలు ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు.