దాచేపల్లిలో ప్రార్థనా మందిరాల కమిటీలతో పోలీసుల సమావేశం

85చూసినవారు
దాచేపల్లిలో ప్రార్థనా మందిరాల కమిటీలతో పోలీసుల సమావేశం
దాచేపల్లి మండల పరిధిలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల భద్రతపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం రాత్రి సమన్వయ సమావేశం జరిగింది. సీఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ ప్రార్థనా మందిరాల నుండి 55 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజల భద్రత కోసం ప్రార్థనా స్థలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అవసరమని అధికారులు తెలిపారు. ఈ సూచనకు ప్రతినిధులు సానుకూలంగా స్పందించి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్