మాచవరం మండలంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం

52చూసినవారు
మాచవరం మండలంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం
మాచవరం మండలంలో మూడవ శనివారం సందర్భంగా ఎంపీడీఓ వెంగళరావు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, ఉపాధి కూలీలతో సంభాషించారు. పలు గ్రామాల్లో మొక్కలు నాటి, ర్యాలీలు నిర్వహించి స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం పరిశుభ్రత, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని వెంగళరావు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్