ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చిన వాసవి అమ్మవారు

71చూసినవారు
ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చిన వాసవి అమ్మవారు
పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ 2వ శుక్రవారం పురస్కరించుకొని వాసవి అమ్మవారికి ప్రత్యేక పూలతో సుందరంగా అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం మహిళలు అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్