ఢిల్లీలోని ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారుపై మొగ్గు చూపారని బీజేపీ సీనియర్ నాయకులు పోకూరి కాశీపతి అన్నారు. శనివారం రెంటచింతల మండల కేంద్రంలో ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంతో రహదారిపై బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని అన్నారు.