నరసరావుపేటలో గురువారం జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. అనంతరం ఆయన జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపినందుకు ప్రశంసాపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పోలిస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అశోక్ బాబుకు మంత్రి మనోహర్ ప్రశంసాపత్రం పత్రం అందజేశారు.