దుర్గి: సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం

66చూసినవారు
దుర్గి: సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం
సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని దుర్గి ఎస్ఐ సుధీర్ అన్నారు. శుక్రవారం ఎస్ఐ సుధీర్ పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ వాహనదారులు ఓవర్ టేక్ సమయాలలో ఏకాగ్రత పాటించాలన్నారు. హెల్మెట్ వాడకం తప్పనిసరన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని తెలిపారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణాలకే ప్రమాదమని రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్