ఆగస్టు నెల సామాజిక ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో గురువారం ఈఓపిఆర్డి సత్యప్రసాద్ పాల్గొన్నారు. కారంపూడి పట్టణంలోని జెండా చెట్టు బజార్ లో లబ్ధిదారులకు ఇంటింటికీ తిరిగి సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో ఫించన్లు పంపిణీ చేశారు. గురువారం సాయంత్రం నాటికి 100 శాతం ఫించన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, అధికారులు పాల్గొన్నారు.