మాచర్ల పట్టణంలో ఆహార భద్రత అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఆహార భద్రత అధికారి లక్ష్మీనా రాయణ నేతృత్వంలో పట్టణంలోని పలు కిచిడి హెూటల్స్, టిఫిన్ సెంటర్స్ ను క్షేత్రస్థాయిలో సందర్శించి తనిఖీలు చేశారు. శాంపిల్స్ ను సేకరించి తనిఖీ విభాగానికి పంపించారు. అలాగే కిచిడి హెూటల్స్, టిఫిన్ సెంటర్స్ యాజమాన్యం, నిర్వాహ కులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. లైసెన్స్ లేని వాటికీ నోటీసులు జారీ చేశారు.