మాచర్ల పట్టణంలో ఫిబ్రవరి 11వ తేదీన కేసీపీ వీఎల్ దత్తు ఆడిటోరియంలో అన్ని ప్రైవేటు పాఠశాలల బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లకు అవగాహన సదస్సు, కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు శుక్రవారం మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ శేషిరెడ్డి తెలిపారు. ఆర్టీఓ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వారి బస్సు డ్రైవర్లను తప్పనిసరిగా పంపించాలని తెలిపారు.