మాచర్ల పట్టణంలో గురువారం స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే, టీడీపీ కాపు మహిళా నాయకురాలు తోటకూర దుర్గ, మహిళా కార్యకర్తలు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులని సన్మానించారు.