శ్రీశైలం నుంచి వస్తున్న వరద నీరు తగ్గడంతో మాచర్ల మండలం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి శుక్రవారం 4గేట్లు ఎత్తి దిగువ పులిచింతలకు నీరు విడుదల చేస్తున్నారు. తొలుత ఆరు గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. అయితే వరద ప్రవాహం తగ్గడంతో రెండు గేట్లు ముసివేసి నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 79, 203 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.