జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమాన్ని ఎస్ఐ సంధ్యారాణి సోమవారం రాత్రి మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని అన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.