మాచర్ల: క్యాన్సర్ పై విద్యార్థినుల అవగాహన ర్యాలీ

76చూసినవారు
మాచర్ల: క్యాన్సర్ పై విద్యార్థినుల అవగాహన ర్యాలీ
ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌ఫై అవగాహన కలిగి ఉండాలని విజయపురిసౌత్ బాలయోగి గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ మేరీ మంజుల తెలిపారు. మంగళవారం మాచర్ల మండలం విజయపురి సౌత్ పాఠశాల విద్యార్థినులతో కలిసి క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపల్ మేరీ మంజుల మాట్లాడుతూ క్యాన్సర్‌ను నయం చేసే వైద్యం అందుబాటులో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంతో క్యాన్సర్‌ను జయించవచ్చునన్నారు.

సంబంధిత పోస్ట్