గతంలో మున్సిపల్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలను తాము బహిష్కరిస్తామని ప్రగల్భాలు పలికిన టీడీపీ నాయకులు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా మున్సిపల్ ఎన్నికలలో అరాచకాలకు పాల్పడటం సిగ్గు చేటని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం మాచర్లలో ఆయన మాట్లాడుతూ పిడుగురాళ్లలో వైఎస్సార్ సీపీకి పూర్తి మెజార్టీ ఉన్న మున్సిపాలిటీలో బెదిరింపులకు దిగి టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు.