మాచర్ల పట్టణ సమీపంలోని నాగార్జునసాగర్ కుడి కాలువలో మంగళవారం యువకుడు గల్లంతు అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగార్జునసాగర్ రహదారి లో టీస్టాల్ నిర్వహిస్తున్న గుంటూరు విజయ సాగర్ మధ్యాహ్నం కుడి కాలువలోకి స్నానం కోసం దిగి కాలు జారి నీటిలో పడి గల్లంతు అయ్యాడు. వినుకొండ మండలం కొండ్రముట్ల గ్రామానికి చెందిన విజయకుమార్ కొంత కాలంగా మాచర్ల లో అక్క, బావ దగ్గర ఉంటూ టీస్టాల్ నడుపుతున్నాడు.