ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తామని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. శుక్రవారం మాచార్ల స్థానిక లైబ్రరీ బజార్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.