పల్నాడు ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు ఆదివారం మాట్లాడుతూ, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం గర్వించదగిన విషయమన్నారు.బీజేపీ విజయం దేశవ్యాప్తంగా కొనసాగుతుందని, త్వరలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కూడా గెలుపు ఖాయమన్నారు. అవినీతి పాలనకు ఢిల్లీ ప్రజలు గుణపాఠం చెప్పారని, బీజేపీని గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.