తప్పులు లేని రికార్డలు, వివదాలు లేని గ్రామాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే కార్య క్రమాన్ని చేపట్టిందని తహశీల్దార్ అర్జున్ నాయక్ అన్నారు. బుధవారం రెంటచింతల మండలంలోని మల్లవరం గ్రామంలోని నీల కంఠేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన సర్వే నెంబర్ 32/3లో 3. 93 ఎకరాల భూమిని రీ సర్వే చేశారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఈవో గాదే రామిరెడ్డి, వీఆర్వో పాపారావు తదితరులు పాల్గొన్నారు.