తుళ్ళూరు: వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

58చూసినవారు
తుళ్లూరు మండలం వెంకట పాలెం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేత నిర్మితమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘ మాంసం భీష్మ ఏకాదశి శనివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేకమైన పూజ కైంకర్యాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు బద్రీనాథ్ స్వామి తెలిపారు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తదుపరి అన్న ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్