రేపు మాచర్లలో తిరంగా యాత్ర

55చూసినవారు
రేపు మాచర్లలో తిరంగా యాత్ర
ఆపరేషన్ సిందూర్ పేరుతో మన దేశ సైన్య శౌర్యపరాక్రమాలను ఘనంగా చాటేందుకు భారత శౌర్య తిరంగా యాత్రను మాచర్ల పట్టణంలోని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు యాత్ర సాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శౌర్యపరాక్రమాలు చాటిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలపాలన్నారు.

సంబంధిత పోస్ట్