దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఎస్ఐ సుధీర్ కుమార్ వాహనాల తనిఖీ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. 50 మంది కూలీలతో వస్తున్న ట్రాక్టర్ను నిలిపి కూలీలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుధీర్ కుమార్ మాట్లాడుతూ సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు.