విజయపురి సౌత్: కంది చేను దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

56చూసినవారు
విజయపురి సౌత్: కంది చేను దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
రెండు ఎకరాల కంది చేనును గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేసిన సంఘటన మాచర్ల మండలం హస్నాబాద్ తండాలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు కేతావత్ రతన్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గత జులై నెలలో రెండు ఎకరాల కందిచేను వేసి సాగు చేశాడు. కంది చేను చేతికి రావడంతో కంది మొక్కలను కోసి కట్టలుగా వేశాడు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు కంది చేనును దగ్ధం చేయడంతో మాచర్ల ఫైర్ ఇంజిన్ కు ఫోన్ చేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు.

సంబంధిత పోస్ట్