మంగళగిరిలో ప్రమాదభరితంగా మారిన ఫిట్ హోల్

59చూసినవారు
మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తపేటలో మంచినీటిని సరఫరా చేసేందుకు పైపులైన్ ద్వారాలు తెరిచే ఫిట్ హోల్ ప్రమాదభరితంగా మారింది. గత కొన్ని రోజులుగా రోడ్డు మార్జిన్ లో ఉన్న ఫిట్ హోల్ మూత తీసి ఉండటంతో అటుగా వచ్చే వాహనదారులు, చిన్న పిల్లలు ఎక్కడ అందులో పడి గాయాలపాలవుతారోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఫిట్ హోల్ ను మూసివేయాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్