మంగళగిరి ఎయిమ్స్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరుపున కల్పించాల్సిన మౌలిక సౌకర్యాల పనులు వెంటనే పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు. ఎయిమ్స్ పరిపాలన భవనంలో ఆమె ఎయిమ్స్ డైరెక్టర్ మరియు సీఈఓ మధభానందకర్, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్ తో కలసి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. 4ఎంఎల్ డీ వాటర్ పైపు లైను పనులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.