మంగళగిరి - విజయవాడ ఓవర్ బ్రిడ్జిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి కారును ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఘటనలో ఆటో ధ్వంసం కాగా కారు పాక్షికంగా దెబ్బతింది. ఓ కుటుంబం మంగళగిరిలో వివాహ వేడుకకు హాజరై తిరిగి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కార్ డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం జరగలేదు. మద్యం మత్తులో ఆటో నడిపిన ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.