మంగళగిరి: అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన బీజేపీ నాయకులు

56చూసినవారు
మంగళగిరి: అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన బీజేపీ నాయకులు
మంగళగిరి పట్టణంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి కాలనీలోని అంగన్వాడి కేంద్రం, రత్నాల చెరువులోని 22వ వార్డు సచివాలయాన్ని బిజెపి నాయకులు శనివారం సందర్శించారు. అంగన్వాడి కేంద్రాలలో చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందిస్తున్నారని వారు తెలిపారు. పాలు, గుడ్లు, ఫోర్టిఫైడ్ రైస్, చిక్కి, బెల్లం, ఖర్జూరం, అటుకులు, రాగి పిండి, నూనె వంటి పది రకాలకు పైగా ఆహారం పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్