మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. రైల్వే బడ్జెట్‌లో ఏపీకి భారీగానే నిధులు కేటాయించిన నేపథ్యంలో లోకేశ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేశ్ రేపు రైల్వే మంత్రితో పాటు మరికొందరు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశముందని తెలిసింది.