మంగళగిరి: మ‌రో కుటుంబానికి సాయం చేయ‌నున్న మంత్రి లోకేష్‌

58చూసినవారు
మంగళగిరి: మ‌రో కుటుంబానికి సాయం చేయ‌నున్న మంత్రి లోకేష్‌
మంత్రి నారా లోకేష్ తాజాగా మ‌రో పేద కుటుంబానికి సాయం చేస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. కడప నియోజకవర్గానికి చెందిన శివకుమార్ అనే యువకుడు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధ పడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. వైద్యానికి అయ్యే ఖ‌ర్చును ఆదుకోవాల‌ని బాధిత కుటుంబం త‌ర‌పున‌ ఓ మ‌హిళ నారా లోకేష్‌కు ఎక్స్‌లో ట్యాగ్ చేసింది. ఇది గ‌మ‌నించిన లోకేష్ ట్వీట్‌పై స్పందించారు. మా టీమ్ మిమ్మ‌ల్ని కాంటాక్ట్ అవుతుంది. అవ‌స‌ర‌మైన సాయం చేస్తార‌ని ఎక్స్‌లో హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్