ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ శనివారం భేటీ అయింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సాయంత్రం మోదీ నివాసానికి చేరుకున్న నారా లోకేష్ కుటుంబ సభ్యులు ప్రధానిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ ప్రధానిని కలిశారు. అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమం సందర్భంలో కుటుంబ సమేతంగా వచ్చి తనను కలవాలని ప్రధాని కోరిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.