మంగళగిరి 100 పడక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి అన్ని పనులు వేగంగా పూర్తి చేయడానికి ఆసుపత్రి సాధన కమిటీ జరిగిన సమావేశంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తీర్మానించినట్లుగా ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సాయిప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ అన్ని వసతులతో చిన్నకాకాని క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో 10 ఎకరాలలో నిర్మించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తున్నామన్నారు.