పొన్నూరు పట్టణ పరిధిలో గురువారం బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న ఏడుగురిని పట్టణ సీఐ వీరనాయక్, అదుపులోనికి తీసుకుని వారిని పోలీస్ స్టేషన్ తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ వీర నాయక్ హెచ్చరించారు.