తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన గురువారం రాత్రి సీడ్ యాక్సిస్ రోడ్డుపై చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు, పనులు ముగించుకొని బైక్ పై తుళ్లూరు నుంచి వైకుంఠపురం వెళుతున్న గోపి అనే వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపి కాలు విరగడంతో పాటు తలకు స్వల్ప గాయమైందని స్థానికులు తెలిపారు. దీంతో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు 108 సహాయంతో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.