పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణంలో మంగళవారం సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసరావుపేట ట్రాఫిక్ సీఐ లోకనాథం మాట్లాడుతూ. వాహనదారులు ప్రతి ఒక్కరూ వాహన పత్రాలను తమ వెంట తెచ్చుకోవాలని అన్నారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహన పత్రాలు లేని వారికి జరిమానా విధించారు.