గుంటూరు జిల్లాలో 3 దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ఐదుగురిని శుక్రవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 3. 20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరు మార్చి 21న ఓబులనాయుడుపాలెంలో, ఏప్రిల్ 13న అనుమర్లపూడిలో, మే 2న కాజీపేటలో దేవాలయాల తాళాలు పగులగొట్టి ఆభరణాలు, హుండీ డబ్బులు దొంగిలించారు.