నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికలను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. అర్హతను బట్టి రూ. 40వేల వరకు జీతం లభిస్తుందన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు నైపుణ్యం. ఏపీ. గవర్నమెంట్ లో ఆన్లైన్ చేసుకోవాలని ఆయన సూచించారు.