జీడీసీబీ మాజీ ఛైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరరావును కేంద్ర గ్రామీణాభివృద్ధి, టెలికమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం రాత్రి పరామర్శించారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలోని నివాసానికి వెళ్లిన మంత్రి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ జీ. వీ. ఆంజనేయులు, ఎమ్మెల్యే అరవింద్ బాబు, జీడీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తదితరులు వచ్చి నల్లపాటి దంపతులను మర్యాదపూర్వకంగా సన్మానించారు.