నరసరావుపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో శుక్రవారం డాక్టర్లు మీడియా సమావేశం నిర్వహించారు. కోల్ కతాలో డాక్టర్ పై జరిగిన ఘటనపై శనివారం ఉదయం నిరసన ర్యాలీ చేస్తున్నామని ఐఎంఏ అధ్యక్షుడు నాగోతు ప్రకాశ్ రావు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రేపు ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీవరకు నరసరావుపేటలో ప్రైవేటు హాస్పిటల్ వైద్య సేవలు నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సేవలు మాత్రమే ఉంటాయన్నారు.