జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి నాదెండ్ల

50చూసినవారు
నరసరావుపేటలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ అరుణ్ బాబు, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్